స్వతంత్ర వెబ్ డెస్క్: ఎవరైనా దంపతులకు పిల్లలు పుడితే అత్తారింటి నుంచి విడిపోయి వేరే కాపురం పెట్టడం కామన్ అయిపోయింది. కానీ రామ్‌చరణ్ దంపతులు మాత్రం పిల్లలు పుట్టాక చిరంజీవి, సురేఖతో కలిసి ఉండనున్నట్లు ఉపాసన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారని.. కానీ తాము పూర్తి భిన్నమని పేర్కొన్నార. ప్రస్తుతం చరణ్, తానూ విడిగా ఉంటున్నామని.. బేబీ పుట్టిన తర్వాత అత్తమామలతోనే ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో గ్రాండ్ పేరంట్స్ పాత్ర చాలా కీలకమన్నారు. గ్రాండ్ పేరంట్స్‌తో ఉంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదన్నారు.