రేవంత్ సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తోందని బండి సంజయ్ అన్నారు. అవసరాన్ని బట్టి కండువాలు మార్చ డం వారి విజ్ఞతపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నియోజకవర్గాలకు నిధులు కేటాయించకపోవడం దారుణ మన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం రేవంత్ సర్కార్ కి అన్ని విధాలుగా సహకరిస్తున్నా, తమ ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. కేంద్రం కూడా కేవలం బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులిస్తామంటే కాంగ్రెస్ ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. నిధులు ఇవ్వకుండా అవమానానికి గురి చేస్తే బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని బండి సంజయ్ హెచ్చరించారు.


