మియాపూర్ లోని రియల్ ఎస్టేట్ కంపేనీ ఉద్యోగినిపై అత్యాచార యత్నం ఘటనపై జీరో FIR కేసు నమోదైందని సిఐ దుర్గ రామలింగ ప్రసాద్ తెలిపారు. యువతి నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చి ఉప్పల్ లో నివాసం ఉంటుందని చెప్పారు. జాబ్ సర్చింగ్ లో భాగంగా మియాపూర్ లోని రియల్ ఎస్టేట్ కంపెనీలో ఈనెల జున్ 29న ఉద్యోగంలో చేరిందని చెప్పారు. యువతిని హాస్టల్ నుంచి రియల్ ఎస్టేట్ కంపేనిలో పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ రెడ్డి లు పికప్ చేసుకున్నారని, యాదాద్రిలో సైట్ విజిట్ చేసి వస్తున్న సమయంలో కారులో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. దాదాపు నాలుగు గంటల పాటు యువతిని కొడుతూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ కేసు వివరాలు వెల్లడించారు,.


