తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ముందు వరసలో ఉంటుంది. పాడి పంటలు, భోగ భాగ్యాలతో కళకళలాడే తెలుగు లోగళ్లకు ముచ్చట గొలిపే ముగ్గులు కొత్త అందాన్నిస్తాయి. అలాంటి రంగవల్లులనే.. అతివలతో అందంగా తీర్చిదిద్దే కార్యక్రమంగా సంక్రాంతి సంబరాలు పేరుతో.. తాడేపల్లిగూడెం, రాజమండ్రి పట్టణాల్లో వేలాదిమంది మహిళలను ఒకచోట చేర్చి ముగ్గుల పోటీలను నిర్వహించింది జెమినీ టీవీ. ముగ్గుల పోటీలకు రెండు పట్టణాల్లో విశేషమైన స్పందన లభించింది. వందలాదిగా మహిళలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ‘ఏవండోయ్ శ్రీమతిగారూ’, ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ సీరియళ్ల ఆర్టిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి జెమినీ టీవీ తరపున బహుమతులను అందజేశారు.


