తిరుమలలో రేపు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొమ్మిదో తేదీన ఉగాది ఆస్థానం సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరు మంజనం నిర్వహించనున్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుం డటంతో వీఐపీ బ్రేక్‌ను టీటీడీ రద్దు చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటికే ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను రద్దు చేసిన టీటీడీ… ప్రొటోకాల్ పరిధిలో స్వయంగా వచ్చే వీఐపీలకు, ట్రస్టు దాతల కు మాత్రమే బ్రేక్ దర్శన టికెట్లను జారీ చేస్తున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో వీటిని కూడా రద్దు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది.