స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. 1,92,275 మంది ఇంజనీరింగ్ పరీక్ష రాయగా.. 1,06,514 మంది అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష రాశారు. ఇంజనీరింగ్ విభాగంలో 80శాతం మంది.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 86శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మే 10 నుంచి 14 వరకు ఈ పరీక్షలు జరిగాయి. జూన్ లో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఇక స్థానిక విద్యార్థుల కోసం రాష్ట్ర కోటా కింద 85శాతం రిజర్వ్ చేయగా, 15శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు.