ఫోన్ టాపింగ్ వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో అరెస్ట యిన మాజీ టాస్క్ ఫోర్స్ డిసిపి రాధా కిషన్ రావు కన్ఫెషన్ స్టేట్ మెంట్ రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన సర్వర్ల ద్వారా నగదు రవాణా జరిగినట్టు రాధా కిషన్ రావు చెప్పారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలతో పాటు 2023 జరిగిన ఎన్ని కల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీగా నగదు తరలింపు జరిగినట్టు తెలిపారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో అరెస్టయిన మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావును పోలీసులు 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్ కు తరలించారు. నాంపల్లి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఈ చర్య చేపట్టారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం ఆయన పనిచేశారు. అయితే, రాధాకృష్ణన్ రావు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన సర్వర్ల ద్వారా నగదు రవాణా చేసినట్టు ఆయన చెప్పారు. హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీల నగదు తరలింపులపై ఫోకస్ చేసినట్టుగా దర్యాప్తుల్లో తెలిపారు. నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో ఈ పనులు చేసినట్టు రాధా కిషన్ రావు తెలిపారు.
2018 దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలతో పాటు 2023 లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీగా నగదు తరలింపు జరిగినట్టు రాధాకృష్ణన్ రావు తెలిపారు. ఇందుకు మొత్తం టాస్క్ ఫోర్స్ టీమ్ సహాయ సహకారాలు అందించిందని చెప్పారు. 2023 లో టాస్క్ ఫోర్స్ లో పని చేసిన ప్రతిఒక్క ఇన్ స్పెక్టర్, ఉద్యోగి సొమ్ములు పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. ఇందులో రాధా కిషన్ రావు చిన్న నాటి మిత్రుడు OSD MLC వెంకట్ రామ్ రెడ్డి చాలా కీ రోల్ ప్లే చేసినట్టు వెల్లడైంది. పట్టుబడ్డ నగదు మొత్తం ప్రతిపక్షాలకు చెందినదిగా స్పష్టత ఇచ్చాడు. ఈ కేసు రిమాండ్ రిపోర్ట్ లో A4 నిందితుడిగా రాధాకిషన్ రావు పేరును పోలీసులు నమోదు చేశారు.
మునుగోడు ఉపఎన్నిక సమయంలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి నగదు అందకుండా చేసినట్టు రాధా కిషన్ రావ్ తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆదేశాలతో ఎస్ఐబి డిఎస్పి ప్రణీత్ రావ్ తో కలిసి స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఆ టీం ద్వారానే ఉప ఎన్నికల సమయంలో నగదు లావాదేవీలకు సంబంధించి అడ్డుకట్ట వేసినట్టు తెలిపారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షలు సీజ్ చేశా మని రాధా కిషన్ రావు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్ రావు బంధువుల నుంచి ఫోన్ ట్యాపింగ్ ద్వారా కోటి రూపాయలు సీజ్ చేసామని ఒప్పుకున్నాడు. ఆ ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి 3 లక్షల 50 వేల రూపాయలను పట్టుకున్నామని వెల్లడించారు.


