స్వతంత్ర, వెబ్ డెస్క్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అదరగొడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు 76 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. అయితే మిడిలార్డర్‌లో వచ్చిన స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ముఖ్యంగా హెడ్ అయితే అటాకింగ్ గేమ్ ఆడుతూ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 106 బంతుల్లోనే 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో టెస్టుల్లో ఆరో సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం 125 పరుగులతో ఆడుతున్నాడు. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన స్మిత్(81) రాణిస్తున్నాడు. వీళ్లిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 172 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 292/3 పరుగులుగా ఉంది. అటు భారత్ బౌలర్లలో సిరాజ్, షమీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.