పంజాబ్ లోని లుధియానాలో గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు.మరికొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలో పాల డెయిరీలో విష వాయువు లీకైనట్లు కావడంతో చుట్టుపక్కల ప్రాంతంలోని అనేక మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు రంగప్రవేశం చేసి.. ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. బాధితుల్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయస్ పుర ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా, విశవయాయువు లీక్ కావడంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.