ఇటీవలికాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది వ్యవసాయ ఆధారిత పర్యాటకం. వ్యవసాయాన్ని పర్యాటకంతో అనుసం ధానం చేయడమే మౌలికంగా అగ్రో టూరిజం.వ్యవసాయ పర్యాటకం మొదటగా అమెరికాలో వాడుకలోకి వచ్చింది. ఆ తరువాత మన దేశంలోకి కూడా విస్తరించింది. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవ సాయం వెన్నెముక. మనదేశ జనాభాలో 75 శాతం మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ రంగం పై ఆధారపడి జీవిస్తున్నారు. భారతదేశ జీడీపీలో దాదాపు 26 శాతం వ్యవసాయరంగం నుంచి వస్తుంది. గ్రామీణ ప్రాంత అభివృద్ధిలో కూడా వ్యవసాయ ఆధారిత పర్యాటకం కీలక పాత్ర పోషిస్తోంది. భారత దేశంలో వ్యవసాయ పర్యాటకం సంవత్సరానికి సగటున 20 శాతం వృద్ధి చెందుతోంది.
మనదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ పర్యాటకం కీలకంగా మారింది. అగ్రో టూరిజం ద్వారా వచ్చే ఆదాయం ఏడాదికే డాది ఇరవై శాతం పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ కార్యక లాపాలను పర్యాటకంతో జోడిస్తున్నారు.దీంతో స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది భారతదేశం. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వ్యవసాయ ఆధారిత పర్యాటకం ప్రధానోద్దేశం. అగ్రో టూరిజం వల్ల కేవలం అన్నదాతల బతుకులు బాగపడటమే కాదు, గ్రామీణ భారతదేశానికి కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. అగ్రో టూరిజం ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. భారతదేశంలో అగ్రో టూరిజానికి నాంది పలికింది మహారాష్ట్ర. అక్కడి బారామతిలో వ్యవసాయ పర్యాటక అభివృద్ధి పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. మన దేశంలో మహారాష్ట్రతో పాటు పంజాబ్, కేరళ రాష్ట్రాలు వ్యవసాయ పర్యాటకానికి వెన్నుదన్నుగా నిలబ డుతున్నాయి. అగ్రో టూరిజంలో భాగంగా వ్యవసాయ క్షేత్రం లేదా గడ్డిబీడుకు సందర్శకులను తీసుకు వస్తారు. ఇందులో భాగంగాపర్యాటకులకు గ్రామీణ జీవితం అలాగే వ్యవసాయరంగం అవగాహన కల్పిస్తారు. వ్యవసాయరంగంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాల గురించి కూడా వివరిస్తారు.