సెంట్రల్ అమెరికాలో వానలు దంచికొడుతున్నాయి. వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అయోవా రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. చాలా కౌంటీలు నీటిలో చిక్కుకున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్తున్నారు. రాక్ వ్యాలీ ప్రాంతంలో పరిస్థితి ప్రమాద కరంగా ఉంది. సమీపంలోని రాక్ నది పొంగిపొర్లుతోంది. రాక్ వ్యాలీలోని ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు. అయోవాలోని 21 కౌంటీల్లో అలర్ట్ ప్రకటించారు. సియూక్స్ కౌంటీ మొత్తం జలమయ మైంది. ఇక వర్షాలతో సౌత్ డకోటా రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతం లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. సౌత్ డకోటాలోని చాలా వరకు జాతీయ రహదారులు జలమయం అయ్యాయి. సియోక్స్ ఫాల్‌లో కూడా భారీ వర్షం కురి సింది. ఇప్పుడు వానలు కొంచెం తగ్గినా అలర్ట్‌గా ఉండాలని అధికారులు హెచ్చరించారు.