కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. సికింద్రాబాద్ బిజెపి పార్లమెంటు అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. మహంకాళి టెంపుల్ నుంచి బిజెపి నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి కిషన్ రెడ్డి ర్యాలీగా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ కిషన్ రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేయను న్నారు.కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రిటైర్డ్ ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఇవాళ కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.


