24.2 C
Hyderabad
Sunday, December 22, 2024
spot_img

నేటి 12రాశుల శుభ, అశుభ ఫలితాలు..

స్వతంత్ర వెబ్ డెస్క్: 

మేషం
చాలావరకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక సంబంధంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఉన్నత యోగం ఉంది. మీ ప్రతిభకు విశేషమైన గుర్తింపు ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు సంపాదిస్తారు. ఆరోగ్యం పరవాలేదు. మంచి కంపెనీ నుంచి ఆఫర్ వస్తుంది. దూరపు బంధువులు కలుస్తారు. చేపట్టే పనులలో చంచల స్వభావం రానీయకండి. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

వృషభం
ఆర్థిక విషయాల్లో గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనుల్లో ఏమాత్రం ఆలస్యం పనికిరాదు. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. మనోబలంతో పనులను పూర్తిచేస్తారు. దేహసౌఖ్యం ఉంది. ధనాగమన సిద్ధి కలదు. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

మిథునం
కుటుంబ పరంగాను, ఉద్యోగ పరంగాను ఒత్తిడి ఉంటుంది. ఇతరుల సహాయంతో పనులు పూర్తి చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మరింత శ్రద్ధ అవసరం. ఇరుగుపొరుగుతో సమస్యలు ఉంటాయి. ఆదాయంతో పాటు ఖర్చులు బాగా పెరుగుతాయి. స్వల్పంగా అనారోగ్యం తప్పదు. వ్యాపారంలో పెట్టుబడి పెంచవలసి వస్తుంది. ఉద్యోగం మారటానికి ఇది సమయం కాదు. దైవబలం అనుకూలిస్తోంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు విశేషమైన లాభాన్నిస్తాయి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

కర్కాటకం
మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. గిట్టనివారితో జాగ్రత్త. ఉద్యోగ పరంగా చాలా బాగుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆనందం కలిగించే విషయాలు వింటారు. మంచి నిర్ణయాలు తీసుకోండి.
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనా శుభప్రదం.

సింహం
ఉద్యోగ వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి. అనవసర ఖర్చులు తడిసి మోపెడవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. మీ మీ రంగాల్లో క్రమశిక్షణతో ముందుకు సాగండి మంచి ఫలితాలు సొంతమవుతాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవ్వరినీ విశ్వసించకండి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు . శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

కన్య
రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. శుభవార్త వింటారు. ఉద్యోగంలో సామాన్య ఫలితమే ఉంటుంది కానీ, ఆర్థిక పరిస్థితి మాత్రం కొంతవరకు మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఉన్నప్పటికీ ఫలితం ఉంటుంది. కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి అవసర సహాయం అందుతుంది. బంధువులు మీ సహాయం తీసుకుంటారు. మంచి కాలం. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

తుల
కొద్దిగా ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. పట్టుదలకు పోకుండా పరిస్థితులను బట్టి వ్యవహరించండి. వృత్తి వ్యాపారాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. సంతోషంగా గడుపుతారు. వస్త్ర, ధాన్యాది లాభాలున్నాయి. విద్య, వినోద సుఖాలు కలుగుతాయి. శరీర సౌఖ్యం కలదు. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

వృశ్చికం
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఫలించి ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. బంధువులలో ఈ ప్రతిష్ట పెరుగుతుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. స్నేహితుల నుంచి ఒత్తిడి ఉంటుంది. హామీలు ఉండవద్దు. అనుకూల కాలం కాదు. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

ధనుస్సు
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆశించిన స్థాయిలో ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీ మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. రుణ బాధ బాగా తగ్గుతుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయాల్లో ఓర్పు అవసరం. శ్రీ విష్ణు ఆరాధన చేయడం మంచిది. సూర్య ఆరాధనా మంచి చేస్తుంది.

మకరం
సమయం చాలా వరకు బాగుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురికి మేలు జరిగే పనులు చేస్తారు. చాలాకాలంగా ప్రయత్నిస్తున్న పని ఒకటి అనుకోకుండా పూర్తవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. సహచరులు బాగా సహకరిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. మంచి భోజన సౌఖ్యం కలదు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

కుంభం
ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారం నిలకడగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. రుణ దాతల ఉత్తిడి తగ్గుతుంది. ఉద్యోగులు బాగా శ్రమ పడవలసి వస్తుంది. హామీలు ఉండవద్దు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. మీ మీ రంగాల్లో సొంత నిర్ణయాలు అనుకూలిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయం వృథా చేయకండి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

మీనం
ఉద్యోగ విషయాల్లో సమయం బాగుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా లాభపడతారు. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు మంచినిస్తాయి. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఇష్టదైన ప్రార్థన చేయడం ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

Latest Articles

డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్