25.7 C
Hyderabad
Monday, June 16, 2025
spot_img

నేటి రాశి ఫలాలు

స్వతంత్ర వెబ్ డెస్క్:

మేషం
ఈ రోజు ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులు మీ సలహాలకు విలువ ఇస్తారు. కుటుంబ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.పిల్లలు పురోగతి సాధిస్తారు. చదువులో విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

వృషభం
సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం పర్వాలేదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం. వృత్తిలో బాగా రాణిస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.

మిథునం
ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. విజయవంతంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలుగాను బాగుంది.

కర్కాటకం
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇంటా బయటా విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా నడుచుకోండి. సత్ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఓ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది.

సింహం
ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడి కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఒక ముఖ్యమైన శుభకార్యం లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో వాదనలకు దిగే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

కన్య
ఆదాయానికి, ఉద్యోగానికి ఇబ్బంది లేదు. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా ఇబ్బందిపెడు తున్న ఒక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు బాగాకష్టపడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి మంచి సమాచారం అందుకుంటారు. చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్ధిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. రామరక్షా స్తోత్రం చదవడం వల్ల ఆపదలు తొలగడంతో పాటు మంచి జరుగుతుంది.

తుల
అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కామర్స్, ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థులకు సమయం బావుంది. పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికం అవుతాయి, ఒక పరీక్షలా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయాలలో అజాగ్రత్త పనికి రాదు ఆదిత్య హృదయం చదవడం వల్ల మంచి ఫలితాలను లభిస్తాయి.

వృశ్చికం
ఆదాయం, ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనాలన్న ఆలోచన చేస్తారు. రాదని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. పెళ్లి సంబంధం వేరే అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

ధనస్సు
విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఉద్యోగం మార డానికి చేసే ప్రయత్నాలు వాయిదా వేస్తారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల మీద డబ్బు బాగా ఖర్చవుతుంది. భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.

మకరం
ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొద్దిగా ఆలస్యంగా అయినా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. అస్థిరబుద్ధి వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికల్లా పనిచేస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.

కుంభం
ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా లేదు. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కొందరు సన్నిహితులు మోసం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుల మీద మరింత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. మనఃసౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. అర్థలాభం ఉంది. ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

మీనం
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఎంతో శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. దగ్గరి బంధువులలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్