స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలుగు హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ‘ఎనర్జిటిక్ స్టార్’ రామ్ పుట్టినరోజు నేడు. లవర్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న అతడు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ సోదరుడు మురళీ పోతినేని కుమారుడైన రామ్ 1988 మే 15న హైదరాబాద్ లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ప్రేమతో 17ఏళ్ల వయసులోనే హీరోగా అరంగేట్రం చేశాడు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ‘దేవదాస్’ సినిమాతో తొలి హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత రెడీ, మస్కా, కందిరీగ, పండగ చేస్కో, నేను-శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ సినిమాలతో జనాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేస్తున్న చిత్రంలో మాస్ అవతారంలో అదరగొడుతున్నాడు. ఈ సినిమాతో భారీ హిట్ కొట్టి మాస్ హీరోగా ముందకెళ్లాలని కోరుకుంటున్నాడు ఈ లవర్ బోయ్.