29.2 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

తిరుపతి నియోజకవర్గం దేనికి నిలయం?

     తిరుమల-తిరుపతి దేవస్థానాలు కొలువు దీరిన నియోజకవర్గం తిరుపతి. నిజానికి శ్రీ వేంకటేశ్వర స్వామి కలియుగ దైవమే కాదు, ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. మరి అలాంటి దివ్యక్షేత్రంలో పాలకులు ఎలా ఉన్నారు? రాజకీయంగా కొట్టుకుంటున్నారా? తిరుపతి అబివృద్ధికి కృషి చేస్తున్నారా? గడచిన కాలంతో పోల్చితే తిరు పతిలో అభివృద్ధి ఎలా ఉంది? ఆ నిజానిజాలేమిటో ….ఆ వివరాల్లోకి వెళదాం.

     సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువే కలియుగ దైవంగా కొలువుదీరిన మహా పుణ్యక్షేత్రం తిరుపతి. అలాంటి పరమ పవిత్ర మైన పుణ్యక్షేత్రం మొదట చిత్తూరు జిల్లాలో ఉండేది. ప్రస్తుతం జిల్లాల విభజన నేపథ్యంలో తిరుపతిని ప్రత్యేక జిల్లాగా మార్పు చేశారు. ఇందులోకి శ్రీకాళహస్తి, గూడూరు, సూళ్లూరుపేట నియోజ కవర్గాలను తీసుకొచ్చారు. దీంతో తిరుపతి నియోజకవర్గం భౌగోళికంగా పలుమార్పులకు లోనైంది. అయితే తిరుపతి లాంటి మహా పుణ్యక్షేత్రం ప్రత్యేక జిల్లాకా వడంతో అందరిలో ఆనందం వ్యక్తమైంది. మొదట తిరుపతి జిల్లాకి బాలాజీ జిల్లాగా పేరు పెట్టారు. తర్వాత వైసీపీ సర్కారు వెనక్కి తగ్గింది. ఉత్తర భారతీయులు వేంకటేశ్వరస్వామిని అలా బాలాజీగా పిలుచుకుంటారు. మన పేర్లు పెట్టమని ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో తిరుపతిగానే ఉంచేశారు. బహుశా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే, శ్రీ వేంక టేశ్వర జిల్లా, శ్రీనివాస జిల్లా ఇలా ఏదొక పేరు పెట్టినా పెడతారని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి.

     1962 నుంచి చూస్తే తిరుపతి నియోజకవర్గంలో రెండు ఉప ఎన్నికలతో కలిపి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. జాతీయ కాంగ్రెస్ 6సార్లు, తెలుగుదేశం 5సార్లు, ప్రజారాజ్యం ఒకసారి, వైఎస్సార్ కాంగ్రెస్ రెండుసార్లు, ఇండిపెండెంట్ 1 సారి విజయం సాధించారు. ప్రస్తుతం తిరుపతి లో 4 లక్షలకు పైగా ఓటర్లున్నారు. వీరిలో స్త్రీలు 2 లక్షల 10వేలు కాగా, పురుషులు ఒక లక్షా 90 వేల మంది ఉన్నారు. ఇటీవల జరిగిన జనాభా లెక్కల ప్రకారం చూస్తే, తిరుపతి నగర జనాభా సుమారు 25 లక్షలుపైనే ఉన్నట్టు సమాచారం. ఓటర్లు 4 లక్షలు, జనాభా 25 లక్షలు అంటూ టీడీపీ ఆందోళన చేయడంతో గందరగోళం ఏర్పడింది. లోక్ సభ ఉపఎన్నికల్లో చుట్టుపక్కల వారిని ఓటర్లుగా చేర్చినట్టు తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం వివాదాస్పదమైంది. అనంతరం తెలుగుదేశం, జనసేన నేతల ఆందోళ నలతో రాష్ట్రం వేడెక్కింది. ఓటర్ల లిస్టులో దొంగ ఓట్లు వచ్చాయా? లేదా? అనేది మాత్రం ఎవరూ తేల్చ లేదు.

     తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్లీ ఆయనే బరిలోకి దిగనున్నారు. కుమారుడికి సీటు ఇవ్వమని అడిగినా జగనన్న దయ కలగలేదని తెలుస్తోంది. ఎందు కంటే ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి కాబట్టి, ప్రయోగాలు చేయలేమని సీఎం జగన్మో హనరెడ్డి చెప్పినట్టు సమాచారం. ఇక్కడ టీడీపీ ఇంచా ర్జిగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన పొత్తు ప్రభావం.. తిరుపతి అసెంబ్లీపై స్పష్టంగా కనిపించే అవకాశాలైతే ఉన్నాయ్. మరి పవన్ పోటీ చేస్తే, సుగుణమ్మ పరిస్థితేమిటి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఎన్టీఆర్, చిరంజీవి కూడా ఇక్కడి నుంచే పోటీచేసి విజయం సాధించారు. ఎన్టీఆర్ తిరుపతి వదిలి, హిందూపురం వెళ్లిపోయారు. ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన చిరంజీవి మాత్రం ఐదేళ్లు ఉన్నారు. ఇదే సెంటిమెంటుతో పవన్ వస్తాడని అంటున్నారు. మరోవైపు భీమవరం, పిఠాపురం, కాకినాడ టౌన్ ఇలా చాలాపేర్లే వినిపిస్తున్నాయి. మరి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఆయనకు కూడా తెలియక పోవచ్చు నని నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. తిరుపతిలో కాపు, బలిజ ఓట్లు ప్రభావం చూపించను న్నాయి.

     ఒకప్పుడు తిరుపతి చిత్తూరు జిల్లాలో ఉండేది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా తిరుపతి కూడా ఒక జిల్లాగా రూపాంతరం చెందింది. ఆ స్వామివారు కొలువుదీరిన దివ్యక్షేత్రానికి ఒక ప్రత్యేకత వచ్చింది. నిజం చెప్పాలంటే తెలుగుదేశం హయాంలో కనిపించేటన్నీ సమస్యలు, వైసీపీ పాలనలో లేవనే చెప్పాలి. ఆన్ లైన్ లో దర్శనం టిక్కెట్లు, గదులు దొరకడంతో భక్తులు ప్రశాంతంగా వెళ్లి వస్తున్నారు. కాకపోతే 300 రూపాయల దర్శనం టిక్కెట్లు నెలకి ఒకసారి ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇవి కూడా ఎక్కువ ఇవ్వడంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

     మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్ సభలో తిరుపతి సమస్య లపై మాట్లాడారు. ఆ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బం దులను బీజేపీ పెద్దల ద్రష్టికి తీసుకువెళ్లారు. దీంతో తిరుపతికి కొత్త రైల్వే స్టేషన్ వచ్చింది. ఇంట ర్నేషనల్ ఎయిర్ పోర్టుగా మారనుంది. ఇలా పలు అభివ్రద్ధి పనులు జరిగాయి. తెలుగుదేశం హయాంలో కూడా పలు పనులు ప్రారంభమై, వైసీపీ ప్రభుత్వంలో పూర్త య్యాయి. ముఖ్యంగా అలిపిరి నుంచి డైరక్టుగా తిరుచానూర్ అమ్మవారి ఆలయం వరకు వేసిన ఫ్లై ఓవర్ కారణంగా చాలావరకు రద్దీ తగ్గింది. కాకపోతే భక్తులు తిరుపతి పట్టణంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అందుకే శ్రీనివాసం దగ్గర ఫ్లై ఓవర్ దిగే అవకాశం కల్పించారు. దీంతో రైల్వేస్టేషన్ కి, వెళ్లి వచ్చే భక్తులు, గోవిందరాజుల గుడి, లోకల్ సైట్ సీయింగ్ అంతా ఫ్లై ఓవర్  కింద నుంచే జరుగుతుంది. నిత్యం తిరుపతి మహా నగరం మీదుగా లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా స్వామి వారి దర్శ నానికి మాత్రం రోజుకి 60 వేల నుంచి లక్షమంది వరకు భక్తులు వస్తుంటారని అంచనా. వీరికి కావాల్సిన టువంటి అన్ని సదుపాయాలను టీటీడీ ఏర్పాటు చేస్తోంది. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి తదితర పర్వదినాల్లో 5 లక్షల మంది రావచ్చునని టీటీడీ అంచనా వేస్తుంటుంది. అయితే బ్రహ్మోత్స వాల సమయంలో గరుడోత్సవం రోజున మాత్రం రెండు లక్షల మంది భక్తులు రావడం ప్రతి ఏడాది జరుగుతుంటుంది.

     ఆన్ లైన్ దర్శనం టికెట్లు ముందుగానే ఇవ్వడంతో భక్తులు తమకు కేటాయించిన స్లాట్ లో దర్శనానికి చక్కగా వెళుతున్నారు. అయితే మూడు నెలలకి ఒకేసారి ఓపెన్ చేయడంతో ఆ సమయంలో తీసుకున్న వాళ్లకే దర్శనం లభిస్తోంది. అయితే ఆన్ లైన్ టిక్కెట్లు ప్రతినెలా ఇవ్వాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మూడు నెలల తర్వాత ఇళ్లల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. చాలా వరకు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొండమీద చాలావరకు సౌక ర్యాలు మెరుగుపడ్డాయని భక్తులు అంటున్నారు. తిరుపతిలో కొత్తగా రైల్వేస్టే షను కడుతున్నారు. అది పూర్తయితే భక్తుల సమస్యలు సగం పూర్తయినట్టే. అలాగే విమానాశ్రయాన్ని కూడా అంతర్జాతీయ స్థాయి లో తీర్చిదిద్దనున్నారు. కొత్తగా ఫ్లై ఓవరు నిర్మాణం జరిగింది. అయితే తిరుమలలో చిరుతపులి చేసిన హంగామాకి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి భక్తులకు కర్రలు ఇస్తామన్న విషయం మాత్రం వివాదాస్పద మైంది.

     తిరుపతిలో ఎన్నో ప్రముఖ దర్శనీయ క్షేత్రాలున్నాయి. వాటన్నింటినీ దర్శించమని పర్యాటక శాఖ కోరుతోంది. కానీ చాలామంది హడావుడిగా వెళ్లడం, రావడం చేస్తుంటారు. ఒకరోజు ఇక్కడే ఉండి, వీట న్నింటిని చూసుకుంటే, పైన కొండమీద ఒత్తిడి కూడా తగ్గుతుందని అంటున్నారు. తిరుచానూరులో పద్మసరోవరంలో వెలసిన పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది. అలాగే తిరుపతికి 5 కిమీ దూరంలో వకుళమాత ఆలయం ఉంది. 7 కిలోమీటర్లలో దూరంలోనే అప్పలాయగుంట ఉంది. అక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. అలాగే తిరుపతి నగరం నడిబొడ్డున వెలసిన స్వయానా వెంకట రమణుని సోదరుడైన గోవిందరాజు స్వామి ఆలయం, నగరంలో మరోవైపు సీతారామలక్ష్మణులు ఆంజనేయ స్వామి ఆలయం, తిరుపతికి 10 కిలోమీటర్ల దూరం శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీవారు కొలువై ఉన్న ఏడుకొండల కింద శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయ.

     వృషభాద్రి, నారాయణద్రి, అంజనాద్రి, గరుడాద్రి, నీలాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, లాంటి పేర్లు గల ఏడుకొండలు దాటి తిరుమల చేరుకోవాల్సి ఉంటుంది. తిరుమలకు రెండు కాలిబాట మార్గాలు కూడా ఉన్నాయి. ఒకటి అలిపిరి మెట్ల మార్గం, మరొకటి శ్రీనివాస మంగాపురంలోని మెట్ల మార్గం. ఇలా రోడ్డు మార్గాన, కాలిబాట మార్గాన వెళ్లే భక్తులకు అసాంతం దివ్యమైన ప్రకృతి సౌందర్యాలు కనువిందు చేస్తుంటాయి. మనసంతా ఆధ్యాత్మిక భావనతో నిండిపోతుంది. గోవిందా…గోవిందా..అంటూ భక్తుల నామస్మరణలతో అనునిత్యం తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తుంటాయి. దర్శనం అయిన తర్వాత కిందకు దిగేటప్పుడు అలిపిరి వద్ద నూరు అడుగులకు పైన అలనాడు లంకలో ఉన్న సీతమ్మ తల్లి జాడను వెతకటానికి బయలుదేరిన ఆంజనేయుని విగ్రహం కనిపిస్తుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విద్య, వైద్య సేవలు ప్రజలకు ఉచితంగా అందుతున్నాయి. తిరుపతి వాసులకు ఇదొక మహదావకాశంగా చెప్పాలి. దేశంలోనే పేరెన్నికగన్న ప్రముఖ వైద్యులు ఇక్కడ ఉన్నారు. అత్యాధునిక వైద్యం ఇక్కడ స్వామివారి భక్తులకు ఉచితంగా అందడం విశేషం. అలాగే విద్య విషయంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూని వర్సిటీ, శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ హైస్కూల్, ఇంటర్ కాలేజీలు, పాలిటెక్నిక్ ఇలాంటివెన్నో విద్యాలయాలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. పేద, ధనిక విద్యార్థు లందరూ ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే తిరుపతి మహానగరాన్ని సరస్వతి నిలయంగా అభివర్ణించాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్