23.2 C
Hyderabad
Saturday, February 7, 2026
spot_img

వర్షంతో చల్లబడిన తిరుమల

   ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేసవి వడగాలులతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ప్రతీ రోజూ దాదాపు 45 డ్రిగ్రీల ఉష్ణోగ్రతలతో కూడిన ఎండలు జనజీవనానికి ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే ఎంతోమంది వడదెబ్బకు గురై ప్రాణాలు సైతం కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల గిరిపై ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. దీంతో తిరుమల కొండపై భక్తులు ఎండల తీవ్రవత నుండి కాస్త ఉపశమనం పొందారు.ఈ రోజు ఉదయం నుండి తిరుమల వాతావరణమంతా చల్లగా ఆహ్లాదకరంగా మారింది. అరగంట సేపు జోరుగా వాన కురిసింది. ఈ వర్షంతో తిరుమల చల్లగా మారిపో యింది. మరోవైపు, కొండపై భారీ వర్షం కురిసినప్పటికీ, కింద తిరుపతిలో చుక్క చినుకు రాలిపడలేదు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్