26.2 C
Hyderabad
Wednesday, March 18, 2026
spot_img

సకాలంలో వైద్య సేవలు అందించాలి – ఆదిరెడ్డి శ్రీనివాస్‌

తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వాసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలందరికీ సకాలంలో వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ వైద్యులకు సూచించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని మాజీ ఎంపీ మురళీమోహన్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఆసుపత్రికి వచ్చేవారిలో ఎక్కువ మంది పేదవారే ఉంటారని.. వారికి ప్రభుత్వ ఆసుపత్రి మినహా ఏ ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లే స్తోమత ఉండదన్నారు. అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఎంతో నమ్మకంతో ఆస్పత్రికి వస్తారని అటువంటి రోగుల పట్ల వైద్యులు వైద్య సిబ్బంది మర్యాదగా నడుచుకోవాలన్నారు. ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వచ్చిన ఏ రోగిని కూడా నిర్లక్ష్యం చేయకుండా వారికి వచ్చిన వెంటనే సకాలంలో వైద్యం చేసి పంపించవలసిన బాధ్యత డాక్టర్లదే అని ఆదిరెడ్డి శ్రీనివాస్‌ సూచించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్