ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ దక్కని వారు పార్టీలు మారుతున్నారు. వైసీపీ టికెట్ దక్కని నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం సైతం టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈనెల 5న ఆయన టీడీపీలో చేరనున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ హామీ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు అనుచర వర్గం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆలూరు, గుంతకల్లు టీడీపీ నేతలు గుమ్మనూరు చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా ఆలూరు నుంచి తిరిగి పోటీ చేసేందుకు వైసిపి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించేందుకు నిరాకరిం చడంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాడు ఆలూరు నియోజకవర్గం నుంచి తాను సూచించిన వ్యక్తుల కాకుండా ఆస్పరి జడ్పిటిసి విరుపాక్షికి వైసిపి పార్టీ ఆలూరు నియోజ కవర్గ సమన్వయకర్తగా నియమించటాన్ని మంత్రి జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికే ఆలూరు నియోజక వర్గం లోని పలువురు వైసిపి నాయకులు పదవులకు రాజీనామా చేశారు.


