సైఫ్ అలీఖాన్‌పై దాడి బాలీవుడ్‌ను షాక్‌కు గురి చేసింది. ఈ అటాక్‌పై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలోని సైఫ్ ఇంట్లోకి అగంతకుడు ఎలా చొరబడ్డాడనేది అర్ధం కావడం లేదు. దుండగుడు సైఫ్‌పై దాడి చేయడంతో వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సర్జరీలు చేసిన అనంతరం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని ప్రకటించారు.
నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు 20 బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే సైఫ్, తన భార్య వారి ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్న సద్గురు శరణ్ భవనంలో అర్ధరాత్రి ఏం జరిగింది అనే విషయాన్ని ఛేదించే పనిలో ఉన్నారు.
అగంతకుడు సైఫ్ ఇంటికి ప్రక్కనే ఉన్న కాంపౌండ్ వాల్ నుంచి ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించాడని పోలీసులు అంటున్నారు. దుండగుడికి భవనం యొక్క లేఅవుట్ గురించి బాగా తెలుసునని.. సైఫ్ ఉండే ఫ్లోర్ చేరుకోవడానికి భవనం వెనుక వైపున ఉన్న మెట్లు వాడుకున్నట్లు గుర్తించారు. తర్వాత ఫైర్ ఎస్కేప్ ద్వారా ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది.
దుండగుడు మొదట సైఫ్ చిన్న కొడుకు జెహ్ గదిలో కనిపించాడు. తాను మొదట తెల్లవారుజామున 2 గంటలకు అగంతకుడిని గుర్తించి అతనిని ఎదుర్కొన్నానని జెహ్ నానీ ఎలియామా ఫిలిప్ చెప్పారు.
“నేను బాత్‌రూమ్ తలుపు వేసి ఉండడం , లైట్ వేయడం చూసి అది కరీనా కపూర్ అని అనుకున్నాను. ఏదో తప్పు జరిగిందని నేను వెంటనే గ్రహించాను . నేను తెలుసుకునేందుకు వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి బాత్రూమ్ నుండి బయటకు వచ్చి తైమూర్ , జెహ్ గదిలోకి ప్రవేశించడం చూశాను, ”ఆమె చెప్పింది.
56 ఏళ్ల నానీకి.. దుండుగుడు ఎదురుపడినప్పుడు.. అతను కోటి రూపాయలు డిమాండ్ చేశాడని చెబుతోంది. ఆమె అతనితో పోరాడటానికి ప్రయత్నించినప్పుడు దుండగుడు కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఇది గమనించిన అదే గదిలో ఉన్న మరో సహాయకురాలు పరుగెత్తుకుంటూ వెళ్లి సైఫ్ అలీఖాన్‌ను నిద్ర లేపింది.
అక్కడికి వచ్చిన సైఫ్ అలీఖాన్‌ను అగంతకుడు కత్తితో ఆరుచోట్ల పొడిచాడు. ఈలోగా మరో సహాయకురాలు గీత సైఫ్ కు సహాయం చేయడంతో ఇద్దరూ కలిసి అగంతకుడిని ఒక గదిలో బంధించారు.
ఆ తర్వాత అందరూ తమ ఇంటి పై అంతస్తుకు వెళ్లారు. అయితే ఆ ఆగంతకుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. అతను పారిపోతున్న సమయంలో ఆరో అంతస్తులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. అయితే, ఆ తర్వాత అతని జాడ లేదు. లాబీ ప్రాంతంలోని సీసీటీవీలలో అతను కనిపించలేదు. అతను గ్రౌండ్ ఫ్లోర్‌కు చేరుకోవడానికి ఫైర్ ఎస్కేప్ ఉపయోగించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం వెనుక తలుపు ద్వారా బయటికి వెళ్లినట్లు చెబుతున్నారు.
సైఫ్‌పై దాడి చేసిన దుండగుడు ఇంట్లోకి చొరబడ్డట్లు ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదు కాలేదు. దాడికి రెండు గంటల ముందు వరకు ఎవరూ ఆ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించిన ఆనవాళ్లు లేవు. చోరీకి పాల్పడేందుకే అగంతకుడు నటుడి ఇంట్లోకి ప్రవేశించాడని పోలీసులు అంటున్నారు.
దుండగుడు సైఫ్ అలీఖాన్‌ను ఆరు చోట్ల కత్తితో దాడి చేశాడు. వెన్నుముకకి దగ్గరగా పొడవడంతో తీవ్ర రక్తస్రావం అయింది.
ఆస్పత్రి వెళ్లేందుకు కార్లు సిద్ధంగా లేకపోవడంతో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీఖాన్‌ను ఆటోలో 2 కిలోమీటర్ల దూరంలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు అత్యవసరంగా ఆయనకు శస్త్రచికిత్స చేసి 2.5 అంగుళాల బ్లేడ్ ముక్కను బయటకు తీశారు. ఎడమ చేతికి, మెడ కుడి భాగానికి అయిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. సైఫ్‌కు ప్రాణాపాయం లేదని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీరజ్ ఉత్తమాని తెలిపారు.