32.6 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

Viral News: కమిట్‌మెంట్‌ అంటే ఇదీ.. జోరు వానలో కరెంట్‌ స్తంభం ఎక్కిన హెల్పర్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: పోటెత్తున్న వరదతో ఊరంతా తడిసి ముద్దయ్యింది. కరెంట్‌ సరఫరా ఆగి ఊరంతా అంధకారమయింది. గ్రామస్థుల అవస్థలు వర్ణనాతీతం. దీన్ని గమనించిన ఓ ఎలక్రిక్టల్‌ హెల్పర్‌ సాహసం చేశాడు. హోరువానలోనూ ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న కరెంట్‌ స్తంభం ఎక్కి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించి గ్రామంలో వెలుగులు నింపాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌.ఎస్‌ మండలం పాతర్లపహాడ్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకోగా, సోషల్‌ మీడియాలో ఎలక్రిక్టల్‌ హెల్పర్‌ను అభినందనల వరద ముంచెత్తుతున్నది.

వర్షాల నేపథ్యంలో పాతర్లపహాడ్‌ గ్రామానికి కరెంట్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చెరువు మధ్యలో ఉన్న కరెంట్‌ స్తంభం మీద సమస్య తలెత్తినట్టు లైన్‌మన్‌ కింద హెల్పర్‌గా పనిచేస్తున్న సంతోష్‌గౌడ్‌ గుర్తించాడు. విపత్కర పరిస్థితుల్లోనూ.. ఈదుకుంటూ వెళ్లి చెరువులో మధ్యలో ఉన్న స్తంభం ఎక్కి దెబ్బతిన్న తీగకు మరమ్మతులు చేశాడు. గ్రామం మొత్తానికి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో గ్రామస్థులతోపాటు ఇతరులు కూడా సంతోష్‌ సేవలకు సలాం కొడుతున్నారు. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా తన ఫేస్‌బుక్‌లో ఆ వీడియోను పోస్ట్‌ చేసి సంతోష్‌ సాహసాన్ని, వృత్తి పట్ల నిబద్ధతను అభినందించారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్