ఇప్పటి వరకు మనం టెక్నాలజీని హ్యాక్ చేసే దొంగలనే చూశాం కానీ, ఆ టెక్నాలజీ ఇన్‌స్టాల్ చేసిన దొంగలే రిమూవ్ చేసి విక్రస్తున్నారు. ఈ తరహా దొంగలను మీరు ఎప్పుడైనా చూశారా…? ఎస్ మీరు విన్నది నిజమే…ఎవరా దొంగలు…? ఎక్కడా చోరీ అనుకుంటుటన్నారా ? అయితే ఆ వివరాల్లోకి వెళదాం….
సూర్యాపేట జిల్లాకు చెందిన బనావత్ నాగరాజు, మలోత్ నగేశ్ (అలియాస్) వరుణ్ చదువు పూర్తయిన తరువాత.. .ఉపాధి కోసం నగరానికి వచ్చి ఎల్బీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ కలిసి ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో టవర్ రిగ్గర్‌గా చేరారు. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సబ్ కాంట్రాక్టర్ వెంకటరమణ వద్ద కూడా పనిచేస్తున్నారు వీరు.
నల్గొండ జిల్లాకు చెందిన చైతన్య, రవి నాయక్ ఉపాధి కోసం నగరానికి వచ్చి ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో ఉంటున్నారు. వారిద్దరూ జియో నెట్‌వర్క్‌లో టవర్ టిగ్గర్స్‌గా చేరారు. కొన్ని రోజుల తరువాత రవినాయక్ ఉద్యోగం మానేసి, ఆటో నడపడం మొదలుపెట్టాడు. ఈనేపథ్యంలోనే సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో చైతన్య తన పాత ఉద్యోగి రవినాయక్‌తో కలిసి రిమోట్ రేడియో హెడ్స్, కేబుల్ తీగలు వంటివి దొంగతనం చేయడం మొద లుపెట్టారు. వ్యసనాలకు అలవాటు పడిన నిందితులు సులభంగా డబ్బు సంపాదించేందుకు రిమోట్ రేడియో యూనిట్స్ , ఎయిర్‌టెల్‌కు చెందిన సెల్‌ఫోన్ టవర్స్ బేస్ బాండ్స్, కేబుల్ వైర్లను తమ అసిస్టెంట్ ఇంజినీరైన అశోక్‌తో కలిసి ఖైరతాబాద్, కాచిగూడ, ఎస్‌ఆర్ నగర్, మధురానగర్, మీర్‌పేట, వనస్థలిపురం, నాగోల్, హయత్‌నగర్, శంషాబాద్, బాలానగర్ తదితర ప్రాంతాల నుంచి దొంగిలించారు. దొంగిలించిన సొత్తును సరూర్‌నగర్‌కు చెందిన శివకు విక్రయించారు. అనంతరం శివ ఆ సొత్తును కంప్యూటర్ స్క్రాబ్ వ్యాపారం చేసే యూపీకి చెందిన దిల్షాద్ మాలిక్, చాంద్ మాలిక్, షహర్యాన్ మలిక్, సోహెల్ మలిక్‌కు విక్రయించాడు. ఈ దొంగ సొత్తును యూపీ గ్యాంగ్ తిరిగి అవసరమున్న వారికి విక్రయించింది.
ఇటీవల నగరంలో టవర్లకు సంబంధించిన పరికరాలు చోరీ అవుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. టవర్లకు ఉండే రేడియో రిమోట్ యూనిట్లు, రిమోట్ రేడియో హెడ్స్, బేస్ బాండ్ యూనిట్ల పరికరాలు మొబైల్ టవర్స్‌లో వాడతారు. మొబైల్ సిగ్నల్స్ అందడానికి ఈ పరికరాలు ప్రధానం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు టవర్ల పరికరాలను ఇన్‌స్టాల్ చేసే వారే ఈ చోరీలు చేయగలరని గుర్తించారు. సాధారణ వ్యక్తులు టవర్లకు ఈ పరికరాలు సెట్ చేయలేరు, వాటిని తొలగించలేరని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వాటిలో పనిచేసి ఉద్యోగం మానేసిన నింది తులపై పోలీసులు నిఘా పెట్టారు. టవర్లలో ఈ పరికరాలను ఇన్‌స్టాల్ చేయడానికి అనుభవం ఉన్న వారిని సెల్యులార్ కంపెనీలు తీసుకుంటాయి. సెల్యూలర్ కంపెనీల్లో నిందితులు తొమ్మిది మంది పనిచేస్తున్నారు. టవర్లకు పరికరాలు ఇన్‌స్టాల్ చేసిన మరుసటి రోజే వీరు వచ్చి ఆ పరికరాలను చోరీ చేస్తున్నారు. టవర్లకు చెందిన పరికరాలు చోరీ చేయ డంలో నాగరాజు, నగేష్ ప్రధాన నిందితులు కాగా, మరో ఐదుగురు రిసీవర్లు ఉన్నారు. ఇలా చోరీ చేసిన ఈ పరికరాలను ఢిల్లీలోని రిసీవర్లకు పంపుతారు. ఢిల్లీలో 500 రిసీవర్లు ఉన్నారు. చోరీ చేసిన సెల్యూలర్ కంపెనీ పరిక రాలు దేశంలో వాడితే ఆయా సెల్యులర్ కంపెనీలు ఐడెంటిఫై చేస్తారు. దీంతో చోరీ చేసిన పరికరాలను విదేశాల కు వివిధ మార్గాల్లో పంపుతున్నారు. చోరీ చేసిన పరికరాలను ఒక్కొక్కటి మూడు లక్షల వరకు విక్రయిస్తున్నారు. నింది తులు చాలాకాలంగా ఈ చోరీలకు పాల్పడుతున్నారు. Airtel 4G RRU-13, ఎయిర్‌టెల్ 5G RRU-1, JIO 4G-RRH-8 కేబుల్ వైర్లు 600 మీటర్లు,సెల్ ఫోన్లు 10 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటి విలువ 60 లక్షల దాకా ఉంటుందని అంచనా. టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును కాచిగూడ పోలీసులకు అప్పగించారు.