స్వతంత్ర వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) శుక్రవారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బును సీఎం జగన్ జమ చేశారు. అమలాపురంలో(Amalapuram) సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా నగదు జమచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు.
రుణాలు మాఫీ చేయకుండా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు నడిరోడ్డు మీద నిలబెట్టారు. బాబు హయాంలో 14వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించామన్నారు. మహిళలను మోసం చేసిన చరిత్ర నారా వారిదే అని స్పష్టం చేశారు. అది వారి చరిత్ర.. అది నారా వారి చరిత్ర.. అది నారీ వ్యతిరేక చరిత్ర అని విమర్శించారు. చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుంది. 2016లో సున్నావడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారు. చంద్రబాబు చేసిన మోసానికి ఏ, బీ గ్రేడ్ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌కు దిగజారాయి.
ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదు. ప్రతిపక్షాల మైండ్‌లో ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయి. ఇన్నిన్ని పథకాలు చంద్రబాబు హయాంలో చూశారా?. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం ఉందా?. మీ బిడ్డల భవిష్యత్ గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా?. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువుల్ని అడ్డుకున్నారు. 75ఏళ్ల చంద్రబాబు ఇళ్లు కట్టించే ప్రయత్నం చేశారా?. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా?. ఇలాంటి చంద్రబాబును ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. చంద్రబాబు కోసం దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నారని అన్నారు.