మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతలలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రెంటచింతలలో టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. కర్రలతో పరస్పరం ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. టీడీపీ, వైసీపీ పోలింగ్ బూత్ ఏజెంట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఘర్షణలో వైసీపీ నేత మూర్తల ఉమా మహేశ్వర రెడ్డి, వైసీపీ కార్యకర్తలు పుట్లూరి వెంకట రెడ్డి, బ్రహ్మారెడ్డి గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులను సరిచేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. గాయ పడిన వైసీపీ నేత, కార్యకర్తలకు గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


