30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో సుప్రీం కోర్టు తీర్పు ఏంతో స్ఫూర్తి దాయకమని అన్నారు MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో మాదిగలకు న్యాయం జరిగిందని ఆయన చెప్పారు. రిజర్వేషన్ ఫలాలు పొందలేని కులాలలో మాదిగలే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. బీసీ కులాల్లో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీ కులాల్లో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. SC వర్గీకరణను అడ్డుకోవాలని ఒక వర్గం చూస్తోందని..ఇప్పటికైనా మాల సోదరులు మానవత్వంతో ఆలోచించాలని మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు.