స్వతంత్ర వెబ్ డెస్క్: మెడికో ప్రీతి సూసైడ్ కేసులో నిందితుడు సైఫ్‌పై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేయడం లవ్ జిహాద్‌ను ప్రోత్సహించడమేనని విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ పగుడాల బాలస్వామి అన్నారు. ప్రీతిని వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమైన సైఫ్ పై సస్పెన్షన్ తొలగించాలని హైకోర్టు తీర్పునివ్వడం దారుణమని, ఇలాంటి తీర్పులతో రాష్ట్రంలో లవ్ జిహాద్ సంఘటనలు మరిన్ని జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలు శిక్ష అనుభవిస్తున్న సైఫ్‌ను గతంలో సరిగ్గా రంజాన్‌కు రెండు రోజుల ముందు విడుదల చేశారని ఇది ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగానే జరుగుతోందని ఆరోపించారు.
హైదరాబాద్‌లో హిందూ అమ్మాయిలే లక్ష్యంగా లవ్ జిహాద్ కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ అనే సందర్భాల్లో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని, షీ టీమ్ ఏర్పాటుతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని పోలీసులు.. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం వేలాది మంది హిందూ అమ్మాయిలు మిస్ అయితే వారి జాడను ఎందుకు కనుకోలేక పోతున్నారో సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. కాగా, ప్రీతి సూసైడ్ కేసులో నిందితుడిగా ఉన్న సైఫ్ పై విధించిన సస్పెన్షన్ వేటును హైకోర్టు ఆదేశాలతో ప్రిన్సిపల్ తాత్కాలికంగా ఎత్తివేశారు.