ఏపీలో ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీ సమరానికి సై అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన దూకుడు పెంచాయి. పార్టీ అధినేతలు ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. టీడీపీ అధినేత ప్రజాగళం పేరుతో చేపట్టిన పర్యటనలు ఇవాళ రెండో విడత ప్రారం భంకానుంది. నేటి నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ప్రజాగళం షెడ్యూల్ రిలీజ్ చేశారు.
ఇవాళ కోనసీమ జిల్లా కొత్తపేట, రామచంద్రాపురంలో చంద్రబాబు ప్రజాగళం సభలు నిర్వహిస్తారు. ఉదయం అంబేద్కర్ కోనసీమ జిల్లా రానున్నారు. ముందుగా జిల్లాలోని రామచంద్రపురం నియోజకవ ర్గానికి వస్తారు. అక్కడ నాలుగు కిలోమీటర్లు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ద్రాక్షారామలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం వెళ్తారు. అక్కడ స్ధానిక నాయకులతో సమావేశం తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి చేరుకుని ఆ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. రేపు కొవ్వూరు, గోపాలపురంలో.. ఈనెల 5న నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. ఈనెల 6న పెదకూరపాడు, సత్తెనపల్లి… 7న పామర్రు, పెనమలూరులో ప్రజాగళం సభల్లో ఆయన పాల్గొంటారు. రోజూ సాయంత్రం 4 గంటలకు తొలి మీటింగ్, 6 గంటలకు రెండో మీటింగ్ నిర్వహిస్తారు. తొలి విడత 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్‌షోల్లో పాల్గొంటారు చంద్రబాబు.