22.2 C
Hyderabad
Monday, February 3, 2025
spot_img

మోనాలిసా జీవితాన్ని మార్చేసిన మహాకుంభ్ మేళా

యూపీలో జరుగుతున్న ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ మేళా ఏకంగా ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. సోషల్ మీడియా పుణ్యమాని ఆమె వీడియో పెద్దఎత్తున వైరల్ కావడంతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగిపోయింది. ఇంకేముంది ఆమె ఫోటోలు, వీడియోలు చూసిన సినీ ప్రముఖులు సైతం ఆమె అందాన్ని ప్రశంసించారు. అసలు పేరు ఇంకా చెప్పట్లేదని బాధపడుతున్నారా? అదేనండి తన తేనేలాంటి కళ్లతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న మోనాలిసా. ఇప్పుడంతా దేశంలో ఎక్కడా చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. పూసలమ్మే ఆ అమ్మాయి అందం తన తలరాతను మార్చనుంది. ఇప్పటికే సినిమాలో ఛాన్స్‌ ఇస్తానని ఓ ఆఫర్ కూడా వచ్చింది.

మహాకుంభ్ మేళాలో పూసలు అమ్ముతున్న మోనాలిసాకు అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా మరో అడుగు ముందుకేశారు. మోనాలిసాకు తాను తెరకెక్కించబోతున్న చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్‌లో ఉన్న మోనాలిసా ఇంటికి వెళ్లి మరి ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్నారు. తాజాగా మోనాలిసాను డైరెక్టర్ సనోజ్ మిశ్రా కలిసి ఫోటో కూడా బయటకొచ్చింది.

అంతేకాదు.. మోనాలిసా సైతం ఈ సినిమా చేయడానికి అంగీకరించిందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా కష్టపడతానని సనోజ్ మిశ్రాకు హామీ కూడా ఇచ్చింది మోనాలిసా. ఇంకేముంది తేనేకళ్ల సుందరిని బిగ్‌ స్క్రీన్‌పై చూసే ఛాన్స్ కూడా త్వరలోనే రానుంది. ది డైరీ ఆఫ్‌ మణిపూర్‌ అనే పేరుతో సనోజ్ మిశ్రా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో నటించేందుకు మోనాలిసా సంతకాలు చేయడంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది.

మహాకుంభ్‌ మేళాకు జీవనోపాధి నిమిత్తం వెళ్లిన మోనాలిసాకు ఊహించని విధంగా ఫేమ్ వచ్చింది. ఓ నెటిజన్ ఆమె వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్దఎత్తున వైరలైంది. దీంతో అక్కడికెళ్లిన వారంతా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వ్యాపారం కంటే ఆమెను చూసేందుకు ఎక్కువమంది వచ్చారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్ వారి తాకిడి పెరగడంతో మోనాలిసాను ఆమె తండ్రి ఇండోర్‌కు పంపించేశారు.

తన రాబోయే చిత్రం “ది డైరీ ఆఫ్ మణిపూర్” కోసం మోనాలిసాను ఎంచుకున్నానని దర్శకుడు సనోజ్ మిశ్రా చెప్పారు. ఈ చిత్రం ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతోందన్నారు. ఇందులో ఇద్దరు కథానాయికల్లో మోనాలిసా కూడా ఉంటారట.. మోనాలిసా సింప్లిసిటీకి ముగ్ధుడై సినిమాలో ఆమెకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు సనోజ్ మిశ్రా. మోనాలిసా కుటుంబాన్ని ఇంటికి వెళ్లి కలిశాడు. ఆమె తన సినిమాలో నటించేందుకు అంగీకరించారని చెప్పాడు. తాను జీవితంలో ఎప్పుడూ నటించలేదనే విషయం తనకు తెలుసునని చెప్పాడు. అదే తాను సవాల్‌గా తీసుకున్నానని… మోనాలిసాకు నటనలో శిక్షణ ఇస్తానని తెలిపాడు. ఆ తర్వాత ఏప్రిల్‌లో సినిమా ప్రారంభిస్తామన్నాడు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిలు పాపులారిటీ కోసం అసభ్యకరమైన రీళ్లు తయారు చేస్తున్నారని… పేద కుటుంబానికి చెందిన మోనాలిసా వంటి సాధారణ అమ్మాయి కూడా వినోద ప్రపంచంలో పని చేయడం ద్వారా ముందుకు తీసుకెళ్లవచ్చని తాను ప్రజలకు చెప్పాలనుకుంటున్నా.. అని సనోజ్ మిశ్రా అన్నారు.

Latest Articles

వలసదారులను ముప్పుతిప్పలు పెడుతున్న ట్రంప్‌

ట్రంప్.. పక్కా జాతీయవాది. జాతిప్రయోజనాలకు విరుద్ధంగా చిన్న నిర్ణయానికి ఆయన అస్సలు అంగీకరించరు. ప్రపంచంలో అన్ని అంశాల్లో అమెరికా ముందుండాలనేదే ట్రంప్ లక్ష్యం. అమెరికా ఫస్ట్ అనే నినాదం నుంచి వైట్ హౌజ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్