స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు జనసేన పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అంబటి హీరోగా SSS సినిమాను ప్రారంభిస్తూ పూజలు చేసింది జనసేన పార్టీ. ప్రోడెక్షన్ నెంబర్ 6093 జగ్గు బాయ్ సమర్పించు సందులో సంబరాల శ్యామ్ బాబు @ రాంబాబు పోస్టర్ ను విడుదల చేసింది. ఈ తరుణంలోనే అంబటి వేష ధారణలో వచ్చారు జనసేన నేత.
అటు పూజలు చేసి షూటింగ్ చిత్రీకరణ ప్రారంభించారు జనసేన పార్టీ నేతలు. ఇక అంబటి రాంబాబు పై క్లాప్ కోట్టి తొలిషాట్ గా డాన్స్ వేయించారు జనసేన పార్టీ నేతలు. ఇది ఇలా ఉండగా, నిన్న పవన్ కళ్యాణ్ చేసిన బ్రో సినిమాపై అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. బ్రో సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయిందని.. పవన్ కళ్యాణ్ తీసుకునే రెమ్యూనరేషన్ అంత కూడా ఈ సినిమా కలెక్షన్లు రాలేదని అంబటి రాంబాబు విమర్శలు చేశారు.