TS Health Director Srinivas| తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన.. తాయత్తు వల్లే ఈ స్థాయిలో ఉన్నానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని.. చిన్నప్పుడు తాను తాయత్తు వల్లే బ్రతికానని అన్నారు. తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఆయన.. మరోసారి ఇరకాటంలో పడ్డారు. తాయత్తు వల్లే తాను బ్రతికానని.. ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్నానని అన్నారు. అధికారిక పదవిలో ఉంటూ డీహెచ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై హేతువాదులు అభ్యన్తరం వ్యక్తం చేస్తున్నారు.