స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: బ్రిటన్ సామ్రాజ్యంలో తొలి రాజ పట్టాభిషేకం ఈరోజు జరుగబోతోంది. బ్రిటన్ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడవ చార్లెస్ కు వందల ఏళ్ళ నాటి సంప్రదాయాలను అనుసరించి కీరిటధారణ చేయనున్నారు. దాదాపు 70 ఏళ్ళ తర్వాత బ్రిటన్ లో జరుగుతున్న తొలి పట్టాభిషేకంగా రికార్డ్ కు ఎక్కబోతుంది. ఇప్పటివరకు రాణులు పాలించగా.. తొలిసారిగా ఒక రాజు నాయకత్వం వహించబోతున్నారు. క్వీన్ ఎలిజిబెత్ -2 మరణం తర్వాత ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ -3 రాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు. మరొకొన్ని గంటల్లోనే ఈ వేడుక జరుగుతుంది. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు పట్టాభిషేకం జరుగనుంది.
ఈ మహోత్సవంలో ఎప్పటినుండో ఆచారంగా వస్తున్న బైబిల్ లోని కొన్ని ఎంపిక చేసిన వాక్యాలను పఠించనున్నారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి బ్రిటన్ రాజకుటుంబీకులు, ప్రభుత్వ పెద్దలతో పాటు దేశవిదేశాల నుంచి 2 వేల మంది వరకు అతిథులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 100 దేశాల ప్రతినిధులు రానుండగా.. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ దంపతులు హాజరుకానున్నారు.
బ్రిటన్ లో 70 ఏళ్ళ తర్వాత పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. చివరి సరిగా 1953లో ఎలిజిబెత్ రాణికి అంగరంగ వైభవంగా పట్టాభిషేఖం జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఇటువంటి కార్యక్రమం జరుగలేదు అయితే గత ఏడాది ఆమె కన్ను మూయడంతో కొత్త రాజుగా ఆమె కుమారుడు చార్లెస్ -3 నియమితులయ్యారు.