దేశంలో ఐదో విడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. 8రాష్ట్రాల్లో 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఐదో విడతలో 659 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 20న ఐదో విడత పోలింగ్ జరగనుంది. యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్‌లో 7 స్థానాలు బీహార్‌లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్‌లో 3 స్థానాలు, జమ్ము కశ్మీర్ లడఖ్‌లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. రాయ్ బరేలి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. లక్నో నుంచి రాజ్‌నాథ్, అమేథి నుంచి స్మృతి ఇరానీ, కైసర్‌గంజ్ నుంచి బ్రిజ్ భూషన్ కుమారుడు కరణ్ బరిలో ఉన్నారు.