వైసీపీ అభ్యర్థి ఖలీల్ నామినేషన్
నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఖలీల్ నామినేషన్ సందర్భంగా వైసిపి నాయకులు, అభిమానులు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఖలీల్ నామినేషన్ వేశారు. గతంలో ఏవిధంగా అయితే వైసీపీని ప్రజలు ఆశీర్వదించారో, అదేవిధంగా నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ ను కూడా ఆశీర్వదించి భారీ మెజార్టీతో వైసీపీని గెలిపించాలని నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రజలను కోరారు.
మాజీ మంత్రి నారాయణ డోర్ టు డోర్
ఏ డివిజన్‌కెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే, తాను చేసిన అభివృద్ధి పనులేనని, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికెళ్లి టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకి వివరించారు. అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి, తనను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డిని ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
వైసీపీ వంశీ నామినేషన్
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వంశీ మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. గన్నవరం తాహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు వంశీ మోహన్ నాలుగు మండలాల నుండి భారీగా గన్నవరంలో వంశి ఇంటి దగ్గరకు చేరుకున్నారు వైసీపీ శ్రేణులుఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
రామచంద్ర యాదవ్ నామినేషన్
చిత్తూరు జిల్లా పుంగనూరులో భారత చైతన్య యువజన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామచంద్ర యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. పుంగనూరు ట్యాంక్ బండ్ నుండి బీసీవై నేతలు ర్యాలీ నిర్వహించారు. రామచంద్రయాదవ్‌కు మద్దతుగా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


