35.2 C
Hyderabad
Tuesday, April 29, 2025
spot_img

సమయానికి తగు మాటలాడి సమయస్ఫూర్తి ప్రదర్శించాలనేది పెద్దల మాట – పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి పార్టీల పంచన చేరాలన్నది నేతల బాట – పార్టీ మారిన ఎమ్మెల్యే…ఉన్న పార్టీపై విమర్శలు..పూర్వపు పార్టీపై ప్రశంసలు

పంచతంత్రం కథల్లో మూడు చేపలు అనే ఆసక్తికర కథ ఉంటుంది. నిక్షేపంలా ఉండే చెరువుకు చేటు వచ్చే పరిస్థితులు వచ్చేస్తున్నాయని ఈ చేపలకు వార్త తెలుస్తుంది. మొదటి చేప… అమ్మో మనం వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ప్రాణాలకు ముప్పు వస్తుంది అని అంటుంది. రెండో చేప.. ఆ క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆలోచన చేయవచ్చు అని రెండో చేప అంటుంది. మూడు చేప ఎప్పుడో ఏదో జరుగుతుందని.. ఇప్పటినుంచి ఆలోచనలు ఎందుకని.. మొత్తం ఘటననే తేలిగ్గా తీసి పారేస్తుంది. అనంతరం మొదటి చేప జాగ్రత్త పడిపోయి…సురక్షిత కొలను ప్రాంతానికి ఎంతో ముందుగానే వెళ్లిపోతుంది. నీళ్లు ఎండి తగ్గిపోయే పరిస్థితిలో రెండో చేప… జాలరి వలకు చిక్కినా.. తన చాతుర్యం వల్లో, నటన వల్లో ప్రమాదం నుంచి బయట పడుతుంది. ఇక మూడో చేప నిర్లక్ష్యం, బద్దకం, ఏం జరుగుతుందిలే అని మొండి వైఖరితో ఎండిన చెరువులో నీళ్ల చుక్క లేని వేళ, మండుటెండలకు మల మల మాడి గిల గిల కొట్టుకుని ప్రాణాలు విడుస్తుంది.

కంచికెళ్లే కథలకు.. ఇలా ఫుల్ స్టాప్ లు వుండవచ్చేమో కాని.. రాజకీయాల్లో అయితే…ఓ పార్టీ ఓ సారి ఓడిపోయిందంటే.. పూర్తిగా కనుమరుగైనట్టు కాదు. ఏవో కారణాల వల్ల పరాజయం పొందినా.. తిరిగి రెట్టించిన ఉత్సాహంతో గెలవావచ్చు. ప్రజాగ్రహం ఉంటే ఓటమి పాలు కావచ్చు. ప్రజా నిర్ణయం, ఓటరు తీర్పుతో వారు, వీరు అవ్వవచ్చు.. వీరు, వారు అవ్వవచ్చు.. అధికారపక్షం విపక్షం కావచ్చు. ప్రతిపక్షం అధికార పక్షం కావచ్చు. అయితే, ఎప్పుడు ఏ పక్షానిది అధికార పక్షం అవుతుందో గ్రహించే..పంచతంత్ర కథలోని మధ్య చేపలా వ్యవహరించే నేతలు ఇప్పుడు అధికంగా ఉంటున్నారు. సమయం, సందర్భం చూసి.. పార్టీలు మారిపోయి…సర్వైవ్ అయిపోతున్నారు.

ఇలాంటి కథలను మననం చేసుకుంటారో ఏమో కాని.. రాజకీయ నాయకులు…పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారిపోవడాలు జరుగుతుంటాయి. ఇందులో తప్పేమి లేదు. ఎందుకంటే..పార్టీ ధీనస్థితికి చేరినప్పుడు దాన్ని పట్టుకు వేల్లాడితే.. ఒరిగేది ఏముంటుంది. తెలివి తేటలు ఉపయోగించి.. ఏదో అధినాయకుడితో గొడవ పడినట్టు డ్రామా సృష్టించేసి, అధికార పక్షానికి చేరిపోయి.. అక్కడ పదవుల్లో ఉండి.. తమ మాతృపక్షం రక్షణకు పరోక్షం సాయం అందించేయడం జరుగుతుంది. లేదంటే.. నిజంగానే పూర్వపు పక్షాన్ని వైరి పక్షంగా చేసుకుని….అధికార పక్షంలో చేరి తమ ప్రాపకం పెంచుకోవడమైనా జరుగుతంది. గెలిచిన పార్టీల్లో పదవులకు గేలం వేయడాలు, పదవులు కొట్టేయడాలు..పదవులు దక్కితే ఆ పార్టీని, అధినేతను ఆకాశానికి ఎత్తడాలు, లేదంటే..ఆ పక్షంలో ఉంటూ విపక్షాలకు సపోర్ట చేయడాలు, అధికార పక్షంపై కారాలు, మిరియాలు నూరడాలు.. ఎంతకీ పదవి రాకపోతే.. సొంత పార్టీలోకి వెళ్లిపోవడాలు.. ఇవీ రాజకీయాల్లో తరచు జరిగేవి.

సమయానుసారం ప్రతిభ ప్రదర్శించి, పరిస్థితులకు అనుగుణంగా వెళ్లి.. అప్పుడు, ఇప్పడు, ఎప్పుడూ.. ఏ ప్రభుత్వంలో ఉన్నా పదవుల్లో కొనసాగే తెలివిగల నేతలు కొందరు ఉంటారు. అయితే, ఓ పార్టీ టికెట్ మీద గెలిచి మరో పార్టీలో చేరిపోయి.. పదవులు సాధించేస్తున్న….జంపింగ్ బాబులకు న్యాయస్థానాలు ఝలక్ లు ఇస్తుండడంతో… జంపింగ్ నేతలకు అయోమయ పరిస్థితులు వచ్చిపడుతున్నాయి. అందుచేత.. ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ చేసినా…జంప్ చేసిన పార్టీలో సరియైన సత్కారాలు, ఆదరణలు లేకపోవడమో, పదవులు రాకపోవడమో..కారణం ఏదైనా చేరిన కొత్త పార్టీపైనే ధూషణలు, వదిలేసిన పార్టీపై ప్రశంసలు సాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, వీటి సంగతి ఏమైనా.. ఆ పార్టీ నుంచి నెగ్గి ఏదో ఆశించి ఈ పార్టీలో చేరడం వల్ల .. మొదటికే మోసం వచ్చే పరిస్థితి కనిపించడంతో..ప్రస్తుతం ఉన్న పార్టీపై తిట్ల వర్షం, పూర్వపు పార్టీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి 2014, 2019, 2023లలో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుమ్మడిదల మండలం ప్యారా నగర్ డంపింగ్ యార్డు బాధితులు ఎమ్మెల్యేకు తమ బాధ తెలియజేశారు. ప్రభుత్వానికి తమ గోడు చెప్పాలని కోరారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా… అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మీరే మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేని కోరారు. దీంతో, ఆయన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అదో పార్టీయా అని ఆగ్రహం చెందారు. తాను బీఆర్ఎస్ పార్టీ నేతనే అని తెలియజేశారు. ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి గ్రామస్తులతో మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇదంతా చూస్తుంటే ఆయన తిరిగి బీఆర్ఎస్‌ పార్టీలోకి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయని పటాన్‌చెరు ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ ఊహాగానాలకు అద్దం పట్టేలా…మహిపాల్ రెడ్డి, కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, తన సోదరుడి కుమారుడి వివాహానికి రావాలని కేసీఆర్ ను మహిపాల్ ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా..పటాన్ చెరులోని తన క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారు.
——-

Latest Articles

‘ముత్తయ్య’ ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి

కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ 'ముత్తయ్య'. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్