మార్ఫింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెలబ్రిటీస్ ఎదుర్కుంటున్న సమస్య. ఇటీవల రష్మిక మార్ఫింగ్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించడంతో పాటు
ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ YJ రాంబాబు తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ కి పిర్యాదు చేసారు. బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అభినందించిన అంజనీ కుమార్ గారు వెంటనే ఈ కేస్ ను సైబర్ క్రైం కి అప్పగించారు. ఇలాంటి చర్యలు జరిగిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.


