రష్యాలోని దక్షిణ డాగేస్థాన్‌లో ఉగ్రవాదుల కాల్పుల వర్షం కురిపించారు. చర్చిలు, ప్రార్థనామందిరాలు, పోలీసు అధికా రులే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో సుమారు 14మంది పోలీసులు, పౌరులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దాడి చేసిన వారిలో ఆరుగురిని పోలీసులు బృందాలు మట్టుబె ట్టాయి.డెర్బెంట్, మఖచక్కల నగరాల్లో ఆర్థోడాక్స్ వేడుక అయిన పెండెకోస్ట్‌ను నిర్వహిస్తుండగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ముష్కరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డాగెస్థాన్‌లో గతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డ చరిత్ర ఉంది. రెండు చర్చిలు, రెండు ప్రార్థనామందిరాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు.