బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బిజెపి కార్యాలయాన్ని ముట్టడించడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నాయకులకు, బిజెపి కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
నాంపల్లిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్లారు. వీరిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకుని ఎదురు దాడి చేశారు.
మరోవైపు బీజేపీ కార్యాలయంపైకి కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఇది మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్తకు గాయమైంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.