తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడూ లేనంతగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తు న్నాడు. ఇప్పటికే పలు చోట్ల 43.5 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు… రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని… అవసర మైతే తప్ప బయటకు వెళ్లద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి ప్రతాపంతో ప్రజలు విలవి ల్లాడుతున్నారు. ఉక్కపోత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతు న్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే వేడి గాలుల ప్రభావం కనిపి స్తోంది. మధ్యాహ్న సమయానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. మేలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతు న్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైనే నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేడిగాలుల ప్రభా వంతో రహదారులపై ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల వారు ఇప్పటికే మజ్జిగ, మంచి నీటి చలివేంద్రాలను చాలా ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. వేసవి ఎండలు తగ్గే వరకు కరెండు కోతలు విధించవద్దని… నీటి సమస్య రాకుండా చూడాలని గ్రామాల్లో స్థానికులు కోరుతు న్నారు.


