స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అమెరికాలో ఓ తెలుగు యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం కప్పెటకు చెందిన బోయ మహేశ్ ఎంఎస్ చేసేందుకు గతేడాది డిసెంబరులో అమెరికా వెళ్లాడు. మిన్నెసొటా రాష్ట్రంలో చదువుతూ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం రాత్రి స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారికి గాయాలయ్యాయి.
మహేశ్ మృతి విషయాన్ని స్నేహితులు కుటుబంసభ్యులకు తెలియజేశారు. కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కుమారుడు ఇలా ప్రమాదంలో అకాల మరణం చెందాడంటూ తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.