స్వతంత్ర వెబ్ డెస్క్: టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత జట్టు 200వ టీ20 మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లోని తదుపరి మ్యాచ్ ఆగస్టు 6న గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరగనుంది. టెస్టులు, వన్డేల్లో ఓటమితో సిరీస్ ఆరంభించిన వెస్టిండీస్.. ఎట్టకేలకు టీ20 సిరీస్‌లో విజయంతో శుభారంభం చేసింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్స్ నిరాశపరిచారు. తక్కువ స్కోర్‌ను కూడా ఛేదించలేక చతికిలపడిపోయారు. ఫలితంగా వెస్టిండీస్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేక 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.
తెలుగు క్రికెటర్ సత్తాచాటినా.. తొలి టీ20లో ఓడిన టీమిండియా..!
యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ అరంగేట్రం చేసి టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేశాడు. వెస్టిండీస్ అత్యుత్తమ బౌలింగ్ ముందు మిగిలిన బ్యాట్స్‌మెన్స్ చిత్తయ్యారు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. 150 పరుగుల స్కోరు ఛేజింగ్‌లో టీమ్ ఇండియా నెమ్మదిగా ఆరంభించింది. దీంతో భారత జట్టు 28 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లేలో భారత్ రెండు వికెట్లకు 45 పరుగులు మాత్రమే చేసింది. శుభ్‌మన్ గిల్ 3, ఇషాన్ కిషన్ 4 పరుగుల వద్ద ఔటయ్యారు. సూర్య కుమార్ 21, హార్దిక్ 19, శాంసన్ 12, అక్షర్ 13, అర్షదీప్ 12 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
Latest Articles
- Advertisement -