Telangana |వేసవి కాలం పూర్తిగా రాకముందే తెలంగాణలో విద్యుత్ వినియోగం(Power Consumption) విపరీతంగా పెరిగిపోతోంది. సోమవారం మధ్యాహ్నం వరకు 14,794 మెగావాట్ల విద్యుత్ వినియోగమైంది.రాష్ట్రంలో వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలు పెరగడం విద్యుత్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దక్షిణ భారదేశంలో వ్యవసాయానికి వినియోగిస్తున్న రాష్ట్రాల్లో మొదటిస్థానంలో తమిళనాడు, రెండవ స్థానంలో తెలంగాణ ఉన్నాయి.
తెలంగాణ(Telangana)లో మొత్తం విద్యుత్ వినియోగంలో రెండవ స్థానంలో ఉంది. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు14,794 మెగా వాట్లు విద్యుత్ మాత్రమే డిమాండ్ కాగా.. ఇదే ఏడాది నమో రికార్టు స్థాయిలో వినియోగం నమదైంది. గత డిసెంబరులో 14,501 మెగా వాట్ల విద్యుత్ నమోదైంది. వేసవికాలం పూర్తయ్యలోపు వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఎంత డిమాండ్ ఉన్నా కానీ 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని జెన్ కో ఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.