ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖశ్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) మరో సంచలన లేఖ విడుదల చేశారు. ఇప్పటికే పలువురి నేతలతో చేసిన వాట్సాప్ చాటింగ్ బయటపెడుతూ పలు లేఖలు రాయగా.. ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన వాట్సాప్ చాట్ అంటూ లేఖలో బయటపెట్టాడు. ఈ చాటింగ్ లో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. కోడ్ భాషలో చాట్ చేసినట్లు లేఖలో ఉంది.
15కేజీల నెయ్యి(రూ.15కోట్లు) రెడీ అంటూ సత్యేంద్ర జైన్ కు సుఖేశ్ మెసేజ్ చేయగా.. హైదరాబాద్ లో ఉన్న సిస్టర్ కు పంపాలని రిప్లై ఇచ్చాడు. అక్కా డబ్బు ఎక్కడికి పంపాలి అని సుఖేశ్ అడగగా.. ఆఫీసుకు పంపాలని కవిత రిప్లై ఇచ్చినట్టు ఉంది. మీరు ఎలా చెప్తే అలాగే అక్క అంటూ సుఖేశ్(Sukesh Chandrasekhar) రిప్లై ఇచ్చాడు. తర్వాత మీ నాన్నకు ఆరోగ్యం ఎలా ఉంది అని కవిత అడిగినట్టు ఉంది.. అడిగినందుకు థ్యాంక్స్ అక్కా.. ఆయనకు కీమో చికిత్స జరుగుతుందని తెలిపాడు.
తర్వాత చాట్ లో అక్కా నెయ్యి సరుకు డెలివరీ అయింది.. దయచేసి AK(అరవింద్ కేజ్రీవాల్) లేదా SJ(సత్యేంద్ర జైన్)కు ఇన్ఫార్మ్ చేయండని మెసేజ్ ఉంది. మనీశ్ తో మాట్లాడా అని అతనికి రిప్లై వెళ్ళింది. ‘కవిత అక్క టీఆర్ఎస్’ అనే పేరుతో కాంటాక్ట్ ఉన్నట్టు స్క్రీన్ షాట్స్ లో కనిపిస్తోంది. చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్స్ తో పాటు మొత్తం 6 పేజీల లేఖను సుఖేష్ విడుదల చేశాడు. ఈ లేఖ ప్రస్తుతం దేశ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే అది నిజంగానే ఎమ్మెల్సీ కవిత నంబరా కాదా అనేది తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఫేక్ స్క్రీన్ షాట్స్ అంటూ కొట్టి పారేస్తున్నాయి.
Read Also: ఖమ్మం ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. బాధితులకు హామీ
Follow us on: Youtube, Koo, Google News