27.2 C
Hyderabad
Sunday, December 22, 2024
spot_img

MLC Kavitha | మోదీని ఎదురిస్తే అరెస్ట్ చేస్తారా? భయపడేదే లేదు: కవిత

MLC Kavitha |ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను అరెస్టు చేసే అవకాశాలున్నాయనే వార్తలపై ఎమ్మెల్సీ కవిత  స్పందించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎవరిని అరెస్ట్ చేయమని చెప్తే వారిని కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తాయా అని ప్రశ్నించారు. ఇందుకోసమేనా ఆ సంస్థలు పనిచేసేదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం భారత జాగృతి తరపున ఈనెల 10న ఢిల్లీ(Delhi)లోని జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరసన దీక్ష చేపడతామని తెలిపారు. మహిళకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన బీజేపీ(BJP) ఇంతవరకు మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. దామషా పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఢిల్లీలో చేపట్టనున్న దీక్షకు దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘం నేతలు, ప్రతిపక్షాల మహిళా నాయకులను ఆహ్వానిస్తామని ఆమె వెల్లడించారు. అలాగే వెంటనే జనగణన చేపట్టాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనగణన చేపట్టకపోవడం దారుణమని కవిత(Kavitha) మండిపడ్డారు.

Read Also: సాత్విక్ ఆత్మహత్య ఘటనపై దద్దరిల్లుతున్న తెలంగాణ

Follow us on: Youtube

Latest Articles

డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్