హైదరాబాద్ నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజీ(Sri Chaitanya College) గుర్తింపును శాశ్వతంగా రద్దు చేసింది ఇంటర్ బోర్డు. ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఘటనపై న్యాయం చేయాలనీ గతకొన్ని రోజులుగా జరుగుతన్న నిరసనలతో రాష్ట్రప్రభుత్వం దిగొచ్చింది. ఈ ఘటనపై చర్యలు తీసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన ప్రాథమిక నివేదికను ఇటీవలే సర్కారుకు సమర్పించింది. అయితే ఈ నివేదికలోకాలేజీలో సాత్విక్ వేధింపులకు గురైన విషయం నిజమేనని తేలింది. మరోవైపు పోలీసుల రిమాండ్ రిపోర్టులోనూ సిబ్బంది వేధింపులు నిజమే అని తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: నా తల నరికివేయండి: మమతా బెనర్జీ
Follow us on: Youtube Instagram