BRS ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ లో తెలియజేశారు. తన కాలికి గాయమైందని.. డాక్టర్లు మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారని తెలిపారు. ఏదైనా సమాచారం లేదా సహకారం కావాలనుకునే వారికి తాను అందుబాటులో లేకపోయినా తన ఆఫీస్ అందుబాటులో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కవిత గాయం గురించి తెలుసుకున్న పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో కవిత(MLC Kavitha)ను మూడు రోజుల పాటు ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె తన ఫోన్లు ఈడీకి ఇవ్వడం.. అధికారులు వాటిని లాయర్ సమక్షంలో పరిశీలించడం జరిగాయి. విచారణ సమయంలో ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks.
My @OfficeOfKavitha shall be available for any assistance or communication.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023
Read Also: బంపర్ ఆఫర్.. పవర్ స్టార్ సినిమాలో పనిచేసే అవకాశం
Follow us on: Youtube, Instagram, Google News