తెలంగాణలోనే ప్రసిద్ధ ఆంజనేయస్వామి ఆలయం జగిత్యాల జిల్లా కొండగట్టు(Kondagattu)లో ఉంది. నిత్యం అనేక మంది భక్తులు ఇక్కడకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆంజనేయుడిని స్మరిస్తూ నిత్యం స్వామి వారి సేవలో ఉంటారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla) జిల్లాలోని అంజనేయ స్వామి మాలా ధరించిన భక్తులు ఎక్కువగా ప్రతి ఏటా ఇక్కడకు వస్తుంటారు. ‘జై శ్రీరామ్ – జై హనుమాన్’ అనే నినాదాలతో నిత్యం స్మరిస్తూ ఉంటారు ఇక్కడి భక్తులు. పర్వదినాల్లో ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయస్వామి వారికి విశేష పూజలు జరుపుతారు.
మంగళవారం కొండగట్టు(Kondagattu) శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచియున్నారు. అంజన్న దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. స్వామి వారిని దర్శించు కుందామని నిండుమనసుతో వస్తే.. ఆలయంలో కనీస వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.
Read Also: కేసీఆర్ మోడల్ దేశానికే ప్రమాదం: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Follow us on: Youtube, Instagram, Google News