స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలోని వికలాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో సీఎం మాట్లాడుతూ.. మొత్తం తెలంగాణ సమాజం బాగుండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా ఫించన్లతో ముసలమ్మలు, ముసలి తాతలు బ్రహ్మాండంగా ఉన్నారని అన్నారు. తొమ్మిదేళ్లు గడిచి.. 10 వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వికలాంగుల పెన్షన్ కూడా పెంచబోతున్నామని తెలిపారు. మరో వెయ్యి రూపాయాలు అదనంగా కలిపి మొత్తం రూ. 4,116 ఇస్తామని స్పష్టం చేశారు. మంచిర్యాల గడ్డ నుంచి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్రకటించాలని నేను సస్పెన్షన్‌లో పెట్టానని తెలిపారు. అందరి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటూ రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు.