స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దేశంలోని ఒక్క రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ గెలవగానే కేంద్రంలో అధికారంలోకి వస్తుందా? అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. కర్ణాటకలో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదనే విషయం గుర్తించాలన్నారు. 2018 ఎన్నికల్లో బీజేపీకి 36శాతం ఓట్ షేర్ రాగా, ఇప్పుడు కూడా అంతే వచ్చిందని తెలిపారు. జేడీఎస్ ఓటు బ్యాంకు చీలి కాంగ్రెస్ పార్టీకి 38శాతం నుంచి 43శాతానికి పెరిగిందని క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ పరోక్ష మద్దతుతో పాటు SDPI, మజ్లిస్ పార్టీలు సపోర్ట్ చేశాయని ఆరోపించారు. కర్ణాటక పరిస్థితులకు తెలంగాణ పరిస్థితులకు చాలా తేడా ఉందన్నారు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటితే.. కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కచ్చితంగా కలుస్తాయని బండి సంజయ్ వెల్లడించారు.