తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నువ్వా-నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి కాంగ్రెస్, బీజేపీ. కిందటేడాది వరకు చక్రం తిప్పి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారత్ రాష్ట్ర సమితి ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా లేదని తేల్చిచెప్పాయి ఎగ్జిట్ పోల్స్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 9 ఎంపీ సీట్లు దక్కవచ్చని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. అటు బీజేపీ కూడా ఆరు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు కైవసం చేసుకునే అవకాశాలున్నాయని తెలిపాయి ఎగ్జిట్ పోల్స్. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్కు ఒకటి నుంచి రెండు ఎంపీ సీట్లు దక్కవచ్చని తేల్చాయి.
ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేశారు. అలాగే బీజేపీకి 8 నుంచి 9 సీట్లు దక్కుతాయని లెక్కలు వేశారు. ఇక, బీఆర్ఎస్‌కు ఒక స్థానం కూడా దక్కదని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పింది. ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్‌పోల్స్ కాంగ్రెస్ పార్టీకి ఆరు నుంచి ఎనిమిది సీట్లు వస్తాయని అంచనా వేశాయి. అలాగే బీజేపీ 8 నుంచి 10 సీట్లలో గెలవచ్చని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. కాగా భారత్ రాష్ట్ర సమితికి ఒక సీటు దక్కవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ ఆరు నుంచి తొమ్మిది సీట్లు కైవసం చేసుకోవచ్చని పేర్కొన్నాయి. కాగా బీజేపీకి ఆరు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు వస్తాయని తేల్చి చెప్పాయి. ఇక భారత్ రాష్ట్ర సమితికి ఒక సీటు లభించవచ్చని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. కాగా ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్‌పోల్స్ కాంగ్రెస్, బీజేపీకి చెరో ఏడు నుంచి తొమ్మిది స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. అంతేకాదు గులాబీ పార్టీ ప్రభావం ఏమీ ఉండబోదని తేల్చి చెప్పాయి ఎగ్జిట్ పోల్స్. అలాగే జన్‌కీబాత్ ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి నాలుగు నుంచి ఏడు సీట్లు, బీజేపీకి తొమ్మిది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొ న్నాయి. కాగా గులాబీ పార్టీకి ఒక సీటు వరకు రావచ్చని పేర్కొన్నాయి జన్‌కీబాత్ ఎగ్జిట్ పోల్స్. ఇదిలా ఉండగా బీజేపీకి ఏడు నుంచి పది సీట్లు రావచ్చని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. కాంగ్రెస్‌కు ఐదు నుంచి ఎనిమది ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. కాగా భారత్ రాష్ట్ర సమితికి రెండు నుంచి ఐదు ఎంపీ సీట్లు దక్కవచ్చని పేర్కొన్నాయి.