తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం విదేశీ పర్యటన కొనసాగుతోంది. దక్షిణకొరియాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రముఖ కంపెనీలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై వివరిస్తున్నారు. అమెరికా టూర్ ముగించుకొని సౌత్ కొరియా వెళ్లిన రేవంత్ టీం.. ఇవాళ యూయూ ఫార్మా ప్రతినిధులతో సమావేశమవుతారు. కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. నెక్ట్స్, హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో కూడా భేటీ కానున్నారు. హ్యాన్ రివర్ ప్రాజెక్ట్ డిప్యూటీ మేయర్‌తోనూ సమావేశమవుతారు. అలాగే సామ్‌సంగ్ అధ్యక్షుడు కిమ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈవోతో భేటీ అవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. రేపు సాయంత్రం సింగపూర్‌కు చేరుకుంటుంది రేవంత్ బృందం. ఎల్లుండి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు.


